English | Telugu

రవితేజ - శ్రుతి హాసన్ సినిమాకి ముహూర్తం కుదిరింది!

on Nov 12, 2019

 

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసే సినిమాకి ముహూర్తం కుదిరింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ రవితేజ 66వ సినిమా నిర్మాణ పనులు నవంబర్ 14న లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ముహూర్తం సందర్భంగా నిర్మాతలు పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో లాంగ్ గన్ పట్టుకొని ఉన్న రవితేజ షాడో స్టిల్ ఉంది. ఈ మూవీలో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ కేరెక్టర్‌ను పోషిస్తున్నాడు. 'బలుపు' తర్వాత రవితేజ, శ్రుతి హాసన్ జోడీగా ఈ సినిమాలో కనిపించనున్నారు. 'కాటమరాయుడు' సినిమా తర్వాత శ్రుతి చేస్తోన్న తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. 

అలాగే దర్శకుడి నుంచి నటుడిగా మారి బెస్ట్ విలన్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న తమిళ నటుడు సముద్రకని ఈ మూవీలో ఒక కీలక పాత్రకు ఎంపికయ్యాడు. అలాగే ప్రతిభావంతురాలైన నటిగా స్వల్ప కాలంలోనే పేరుపొంది, విలక్షణ పాత్రలలతో ఆకట్టుకుంటూ వస్తోన్న వరలక్ష్మి శరత్‌కుమర్ ఒక కీలక పాత్రను చేయనున్నది. తమన్ స్వరాలు కూరుస్తున్న ఈ సినిమాని లైట్ హౌస్ మూవీ మేకర్స్ బేనర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. 'డాన్ శీను', 'బలుపు' వంటి హిట్ సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాపై ఓపెనింగ్‌కు ముందే క్రేజ్ మొదలవడం గమనార్హం.


Cinema GalleriesLatest News


Video-Gossips