మిస్ రష్మిక.. `ఫస్ట్ టైమ్` మిస్ ఫైర్
on Apr 12, 2021
అటు మాతృభాష కన్నడంలోనూ, ఇటు పొరుగుభాష తెలుగులోనూ మంచి విజయాలను ఒడిసిపట్టుకుంది కథానాయిక రష్మిక మందన్న. మరీ ముఖ్యంగా.. ఈ అమ్మడు నటించిన తొలి కన్నడ, తెలుగు చిత్రాలు సక్సెస్ ఫుల్ వెంచర్స్ గా నిలిచాయి.
కన్నడంలో రష్మిక మొదటి ప్రయత్నమైన `కిరిక్ పార్టీ` శాండల్ వుడ్ అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నమోదయింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. మిస్ మందన్న ఫస్ట్ ఎటెంప్ట్ `ఛలో` కూడా బడ్జెట్ పరంగా చూస్తే సూపర్ హిట్ బొమ్మే. ఇలా.. ఏ పరిశ్రమలో తొలి అడుగేసినా రష్మికకు విజయం ఖాయమనే ఇమేజ్ వచ్చేసింది. దీంతో.. కోలీవుడ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందేమోనని ఆశపడ్డ రష్మికకి ఈ సారి చుక్కెదురైంది.
తన డెబ్యూ తమిళ సినిమా `సుల్తాన్` భారీ అంచనాల మధ్య రిలీజై.. డిజప్పాయింట్ రిజల్ట్ ని ఇచ్చింది. దీంతో.. రష్మిక ఏ పరిశ్రమలో `ఫస్ట్ టైమ్` సినిమా చేసినా హిట్ పక్కా అనే సెంటిమెంట్ కి బ్రేక్ పడినట్లయ్యింది. ఈ నేపథ్యంలో.. హిందీనాట రష్మిక చేస్తున్న తొలి ప్రయత్నం `మిషన్ మజ్ను` ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, ప్రస్తుతం రష్మిక చేతిలో `పుష్ప`, `ఆడవాళ్ళూ మీకు జోహార్లు` అనే తెలుగు చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కనిపించబోతోంది రష్మిక.