రష్మిక వండిన 'పుట్టు చికెన్' కూర రుచి చూశారా?
on Nov 24, 2020
మెగా కోడలు ఉపాసన స్టార్ట్ చేసిన ‘యువర్ లైఫ్’ కోసం మొన్నటివరకు సమంత గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక గెస్ట్ ఎడిటర్‌గా ఉంటూ పలు రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. హెల్త్ గురించి తను ఏం ఫాలో అవుతుందో ఆడియన్స్ కు చెబుతూ, ఆరోగ్యకరమైన రెసిపీలను వండుతూ తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తోంది.
తాజాగా చికెన్‌తో ‘కోలీ పుట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన, నటి గానే కాకుండా చెఫ్ గా కూడా రష్మిక రాణిస్తుందంటూ కితాబిచ్చారు. రష్మికకు ఇంకా పెళ్లి కాలేదనీ, మంచి వంట చేసే భార్య కోసం ఎవరైనా చూస్తుంటే.. రష్మిక మంచి ఆప్షన్ అని ఫన్నీగా ప్రశంసించారు ఉపాసన కొణిదెల. ఇలా రష్మిక, ఉపాసన సరదా సంభాషణలతో ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో సందడి చేస్తోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
