English | Telugu

రేష్మీకి హరితేజ స్ట్రోక్?

on Oct 11, 2017

బుల్లితెర గ్లామర్ క్వీన్ రష్మీకి గట్టి దెబ్బే తగిలేలా ఉంది. తాను పాపులర్ అవ్వడానికి కారణం ఈటీవీ కామెడీ షో ‘జబర్ దస్త్’. త్వరలో ‘జబర్ దస్త్’ నుంచి రేష్మీని తప్పిండానికి మల్లెమాల ప్రొడక్షన్స్ సిద్ధం అవుతున్నారట. రేష్మీ స్థానంలో ‘బిగ్ బాస్’ఫేం హరితేజాను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. రేష్మీ రెమ్యునరేషన్ పెంచేయడం... సినిమాల్లో బిజీ అవ్వడం ఇత్యాది కారణాల వల్లే... రేష్మీని తప్పిస్తున్నట్లు తెలిసింది. అయితే... ఈ వ్యవహారంపై అధికార ప్రకటనైతే ఏం రాలేదు. కానీ... ఇందులో నిజం లేకపోలేదని చాలామంది చెప్పుకుంటున్నారు. 

గతంలో హరితేజా కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. కానీ.. పెద్ద సక్సెస్ కాలేదు. సినిమాల్లో కూడా చిన్నా చితకా పాత్రలే ఆమెను వరించాయ్. టీవీ సీరియల్స్ లో మాత్రం మంచి పేరు సాధించింది. అయితే... ‘బిగ్ బాస్’ ఆమె తలరాతను మార్చేసింది. ‘బిగ్ బాస్’ విజేత శివబాలాజీతో పాటు.. ఫైనల్ దాకా వచ్చిన హరితేజా, అర్చన, ఆదర్ష్.. కూడా ఇప్పుడు మోస్ట్ పాపులర్. అందుకు తగ్గట్టే వారికి అవకాశాలు తలుపుతడుతున్నట్లు సమాచారం.  హరితేజకు ‘జబర్ దస్త్’అలా వచ్చిందే. మరి ‘బిగ్ బాస్’ స్థాయిలో హరితేజా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here