అరుదైన ఫొటో: తండ్రి రాజేశ్ ఖన్నాతో టీనేజ్ ట్వింకిల్!
on Oct 28, 2020
బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్‌గా రాజేశ్ ఖన్నా అశేష అభిమానులను సంపాదించుకున్నారు. అమితాబ్ హవా మొదలయ్యే దాకా ఆయనకు తిరుగనేదే లేదు. అలాంటి ఆయనతో కుమార్తె ట్వింకిల్ ఖన్నాకు ఎంతో అనుబంధం. రాజేశ్-డింపుల్ కపాడియా జంట ప్రేమకు ప్రతిరూపం ట్వింకిల్. అయితే 2012 జూలై 18న ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజేశ్ అభిమానుల గుండెలు బద్దలయ్యాయి.. ఆయన ఇక లేరనే వార్త తెలిసి. దేశమంతా కన్నీరు మున్నీరవుతున్న ఆ సమయం ట్వింకిల్ జీవితంలో చీకటి దశ. కానీ క్రమంగా ఆ బాధ నుంచి కోలుకున్న ఆమె.. అప్పట్నుంచీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తండ్రి జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల ద్వారా పంచుకుంటూ ఆయన అభిమానులను ఆనందపరుస్తూ వస్తోంది.
ఇటీవల అలాంటి ఒక అరుదైన ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది 'అలగ్ అలగ్' సినిమా సెట్స్‌కు సంబంధించిన పిక్చర్. అందులో రాజేశ్ ఖన్నా తన కుమార్తె ట్వింకిల్‌తో కనిపిస్తున్నారు. టీనేజ్‌లో ఉన్న ట్వింకిల్ చేతిలో క్లాప్ బోర్డ్ ఉంది. ఆమె పక్కనే నిల్చొని తను కూడా కూతురితో పాటు ఆ క్లాపర్‌ను పట్టుకొని కెమెరా వంక చూస్తున్నారు రాజేశ్. వారు ఫస్ట్ షాట్‌కు రెడీ అవుతున్నట్లుగా, ట్వింకిల్ క్లాప్ కొట్టనున్నట్లుగా ఆ పిక్చర్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్వింకిల్‌కు మరో వైపు ఆ మూవీ హీరోయిన్ టీనా మునిమ్ (అంబానీ) నిల్చొని ట్వింకిల్ వైపు ముచ్చటగా చూస్తున్నారు.
తండ్రీకూతుళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కానీ, వారి సన్నిహితులు మాత్రం రాజేశ్, ట్వింకిల్ మధ్య ఉన్న గాఢానుబంధం గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు. తండ్రి మృతి చెందినప్పుడు ఆ నిజాన్ని జీర్ణించుకోవడం ట్వింకిల్‌కు చాలా కష్టమైపోయిందనీ, ఆమెను ఓదార్చడం భర్త అక్షయ్ కుమార్ వల్ల కూడా కాలేదనీ అంటారు.