రంగస్థలంలో కమెడియన్‌కి జరిగిన ద్రోహం
on Apr 2, 2018
రంగస్థలం సూపర్ డూపర్ హిట్టయిపోయింది. చిత్రసీమ అంతా రంగస్థలంని పొగడ్తల వర్షంలో మెంచెత్తుతోంది. చరణ్ గత చిత్రాల రికార్డులనన్నింటికీ ఈ సినిమా తుడిచిపెట్టేయడం ఖాయం. అయితే.. ఈ సినిమా ఓ హాస్యనటుడికి అన్యాయం చేసింది. అతనెవరో కాదు... 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృథ్వీ. రంగస్థలం సినిమాకీ అతనికీ ఉన్న సంబంధం ఏమిటనుకుంటున్నారా? ఈ సినిమాలో తను కూడా నటించాడు. ఫృథ్వీపై ఓ సెపరేట్ కామెడీ ట్రాక్ డిజైన్ చేశాడు సుకుమార్. అది బాగా పేలిందట కూడా. చివర్నో పెరిగిన నిడివి దృష్ట్యా కొన్ని సన్నివేశాల్ని తొలగించాల్సివచ్చింది. అందులో భాగంగా ఫృథ్వీ సీన్లన్నీ తీసేశారు. తాను నటించిన సినిమా చూసుకోవడానికి థియేటర్‌కి వెళ్లిన ఫృథ్వీని సినిమాలో తానెక్కడా కనిపించకపోయే సరికి ఫీల్ అయినట్టు తెలుస్తోంది. అయితే అదెక్కడా కనిపించకుండా.. ``రంగస్థలం చాలా బాగుంది. చిరంజీవి ఇంట్లో ఓ కమల్ హాసన్ పుట్టాడు`` అంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం పంపాడు. లోలోపల హిట్ సినిమాలో నటించినా తనకు ఆ క్రెడిట్ రాలేదన్న బాధ ఉన్నా.. దాన్ని దిగమింగుకుని పాజిటీవ్‌గా స్పందించాడంటే... ఫృథ్వీ గొప్పోడే.