మ్యారీడ్ లైఫ్‌పై నోరువిప్పిన రానా!
on Apr 8, 2021
హాండ్సమ్ హంక్‌గా పేరుపొందిన రానా దగ్గుబాటి ఎప్పుడైతే తాను మిహీకా బజాజ్‌తో ఎంగేజ్ అయ్యానని ప్రకటించాడో అప్పుడు లక్షలాది మంది అమ్మాయిల గుండెలు బద్దలయ్యాయి. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో అనే డెకరేషన్ కంపెనీ నడుపుతోన్న మిహీకాను 2020 ఆగస్ట్‌లో పెళ్లాడాడు రానా. మిహీకా ఫ్యామిలీ ముంబైకి చెందినదైనప్పటికీ, స్కూల్ డేస్ నుంచి ఆమె హైదరాబాద్‌లోనే ఉంటోంది.
"పవర్‌హౌస్ ఆప్ టాలెంట్స్" అయిన రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, టెలివిజన్ ప్రెజెంటర్, విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్, వ్యాపారవేత్త. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'నంబర్ 1 యారి' షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లేటెస్ట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడాడు రానా. మిహీకాతో తన జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని తెలిపాడు. "వైవాహిక జీవితం నాకు చాలా మంచి చేసింది. నేను సెటిల్ అయ్యాననే ఫీలింగ్ కలిగిస్తోంది. సో.. నేను హ్యాపీగా ఉన్నాను." అని చెప్పాడు.
గత ఫిబ్రవరిలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్నాడు రానా. అతని తొలి చిత్రం 'లీడర్' 2010 ఫిబ్రవరిలో విడుదలైంది. ఆ స్పెషల్ మూమెంట్ సందర్భంగా భర్తను పొగిడింది మిహీకా. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రానా పిక్చర్‌ను పోస్ట్ చేసిన ఆమె దానికి “Happy 11 years my darling @ranadaggubati” అనే క్యాప్షన్ పెట్టింది. "నీ అభిరుచి, నీ సంకల్పం, జీవితంలో ఏ విషయానికైనా వంద శాతం ఇచ్చే నువ్వు అమేజింగ్ మ్యాన్‌వి. నువ్వెప్పుడూ ఇన్స్పైరింగ్గా ఉంటావు. ఎప్పుడూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటావు. ఎప్పుడు కలలు కంటుంటావు. అయినా వినమ్రుడిగా ఉంటావు! నువ్వు కేవలం టాబ్లాయిడ్ మీదే కాదు, నిజ జీవిత హీరోవి." అని ఆమె రాసుకొచ్చింది.