రానా ఇంటి లోపల లుక్కేస్తే కళ్లు చెదరిపోవాల్సిందే!
on Aug 12, 2020
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఫైనెస్ట్ యాక్టర్స్‌లో ఒకడిగా రానా దగ్గుబాటి పేరు తెచ్చుకున్నాడు. తాత దివంగత రామానాయుడు బాటలో తండ్రి సురేశ్‌బాబు, బాబాయ్ వెంకటేశ్ అందరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతుండగా, వారి వారసుడిగా తెరపైకి వచ్చాడు రానా. ఆగస్ట్ 8న కొద్ది మంది అత్యంత సన్నిహితుల మధ్య కన్నుల పండుగగా జరిగిన పెళ్లి వేడుకలో తన ఫియాన్సీ మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసి, వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం రానా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిహీకా కూడా ఆ ఇంటిలో ఓ సభ్యురాలైంది.
చాలామంది రానా అభిమానులకు ఆయన ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనే కోరిక ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ అతి కొద్దిమందికే దక్కవచ్చు. కానీ ప్రత్యక్షంగా ఆ ఇంటికి వెళ్లలేకపోయినా, పిక్చర్లలో అదెలా ఉంటుందో, ఇంటి లోపల గదులెలా ఉంటాయో, వాటి అలంకరణ ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో రానా ఇల్లు ఉంది. విశాలమైన ఆ ఇంటిలో సామాన్యులు కలల్లో మాత్రమే చూసే అలంకరణలు ఉంటాయి. అది వైట్ కలర్ బంగళా. పచ్చికతో కూడిన లాన్, అందమైన గార్డెన్స్, ఖరీదైన వుడ్వర్క్తో కూడిన గదులతో ఆ ఇల్లు ఆకర్షణీయంగా ఉంటుందని ఈ ఫొటోలు చెబుతాయి.
ఫిల్మ్‌నగర్‌లోని రానా ఇల్లు
రానా ఇంటి ఎంట్రన్స్
లివింగ్ రూమ్
రానా బార్
రానా ఆఫీస్
రానా టేబుల్ డెస్క్
ఇంటి లాన్
విజిటర్స్ రూమ్
Also Read