బాలీవుడ్ లో వర్మ కొట్టేశాడు..!
on May 28, 2016
కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ కు వెళ్లిన వర్మకు పునస్వాగతం ఘనంగా లభించింది. వీరప్పన్ తో హిందీ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ అడుగుపెట్టి విజయం సాధించాడు. వీరప్పన్ సినిమాకు బాలీవుడ్ రివ్యూయర్లు మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ వర్మ సినిమాను క్రిటిసైజ్ చేసిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు. గత కొంత కాలంగా, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని వర్మ తెలుగు సినిమాలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో కూడా వరస పరాజయాలే ఎదురు కావడంతో, మళ్లీ బాలీవుడ్ కు చేరుకున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో రిలీజై హిట్టు కొట్టిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు కొద్ది భాగం మళ్లీ షూట్ చేసి, వీరప్పన్ పేరుతో హిందీలో విడుదల చేశాడు. అయితే మొదటి నుంచీ వర్మ మరో ఫ్లాప్ అకౌంట్ లో వేసుకోబోతున్నాడనే అందరూ అనుకున్నారు. విచిత్రంగా సినిమా అద్భుతంగా ఉందని పేరు తెచ్చుకోవడం విశేషం. అమితాబ్ అయితే ఒక అడుగు ముందుకేసి, వర్మ ఒక జీనియస్ అని పొగడటమే కాక, అతని దర్శకత్వంలో సర్కార్ 3 చేస్తానని ప్రకటించేశారు. మొత్తమ్మీద బాలీవుడ్ లో వర్మకు మళ్లీ మంచి రోజులు మొదలైనట్టున్నాయి.