సుశాంత్ ఫ్యామిలీ vs శివసేన!?
on Aug 11, 2020
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాటలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయి. మాటల యుద్ధానికి అది దారితీసేలా ఉంది. తండ్రితో సుశాంత్‌కి సత్సంబంధాలు లేవని శివసేన పత్రిక సామ్నాలో సంజయ్ రౌత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం హీరోకి ఇష్టం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ లాయర్ వికాస్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
"శివసేన ఇటువంటి స్టేట్మెంట్ తో రావడం చాలా దురదృష్టకరం. సుశాంత్ గురించి లేదా అతని తండ్రి గురించి శివసేన పార్టీలో ఎవరికీ తెలుసు అని అటువంటి ఆరోపణ చేశారు? రియా చక్రవర్తితో రిలేషన్ లో ఉన్నప్పటికీ సుశాంత్ పాట్నా వెళ్ళాడు. తండ్రిని ఊరు తీసుకువెళ్లి టైమ్ స్పెండ్ చేశాడు" అని వికాస్ సింగ్ పేర్కొన్నారు.
సుశాంత్ మరణించి రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ అతడి మృతి మిస్టరీగా మిగిలింది. రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించిందనే ఆరోపణలపై ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Also Read