పవన్ సినిమా వల్ల వర్మకు లాభమే!
on Aug 14, 2020
గత సార్వత్రిక ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్, ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఓటమి పై వ్యంగ్యాస్త్రంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా 'పవర్ స్టార్'. ఆ మాట వర్మతో అంటే ఒప్పుకోరు. తన సినిమాలో హీరో ప్రవన్ కళ్యాణ్ అంటారు. ఏటీటీ (ఎనీ టైం థియేటర్)లో విడుదల చేసిన ఈ సినిమా కొన్ని గంటల్లోనే పైరసీకి గురి అయింది. అయినా వర్మకు లాభమే వచ్చిందట.
అప్సరా రాణి ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కించిన 'థ్రిలర్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పవర్ స్టార్' వల్ల లాభాలు వచ్చాయని వర్మ చెప్పుకొచ్చారు. కొన్ని పాలసీల కారణంగా దానికి ఎంత బడ్జెట్ అయిందనేది, ఎన్ని వసూళ్లు వచ్చాయనేది ఆయన చెప్పలేనని అన్నారు. పైగా, ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇటువంటి సినిమాలు తీస్తున్నానని అన్నారు. కొన్ని చిత్రాల్లో డిజిటల్ రిలీజ్ చేస్తే బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని, అందుకనే థియేటర్లు తెరిచే వరకు 'బ్రూస్ లీ ఎంటర్ ది డ్రాగన్' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని వర్మ అన్నారు. 'మర్డర్'లో తను ఎవరి పక్షం వహించడం లేదని స్పష్టం చేశారు ఆయన. ఆ సినిమాపై ప్రణయ్ భార్య అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read