మోహన్‌బాబు సినిమాలో నటించడం లేదు.. మేనేజర్‌తో వివరణ ఇప్పించిన రకుల్!
on Nov 25, 2020
మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్ జిగరీ దోస్త్లనే విషయం తెలిసిందే. అందుకే లక్ష్మి రికమండేషన్‌తో మోహన్‌బాబు సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'లో రకుల్ నటిస్తోందంటూ మీడియాలో ఈరోజు విరివిగా ప్రచారంలోకి వచ్చింది. ఇదేరోజు ఆ సినిమా ప్రోగ్రెస్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో ఎక్కడా రకుల్ పేరును ప్రస్తావించలేదు. మరోవైపు తన మేనేజర్ హరినాథ్ చేత రకుల్ వివరణ ఇప్పించింది.
అందులో 'సన్ ఆఫ్ ఇండియా' పేరును కానీ, మోహన్‌బాబు పేరును కానీ ప్రస్తావించకుండా తాను చేస్తున్న సినిమాలేవో వెల్లడి చేసింది. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చిన కొన్ని వదంతులను దృష్టిలో పెట్టుకొని ఈ వివరణ ఇచ్చినట్లు కూడా అందులో హరినాథ్ తెలిపారు.
ఆ వివరణలో రకుల్ చేస్తున్న సినిమాల వివరాలు..
1. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేస్తోన్న 'చెక్' మూవీ. ఇందులో నితిన్ హీరోగా నటిస్తుంటే, రకుల్ అడ్వకేట్ రోల్ చేస్తోంది.
2. ఇంకా టైటిల్ నిర్ణయించని డైరెక్టర్ క్రిష మూవీని రకుల్ పూర్తి చేసింది. ఇందులో ఆమె గ్రామీణ యువతిగా కనిపించనుంది.
3. ఒక తమిళ సినిమాలో శివ కార్తికేయన్ జోడీగా నటిస్తోంది.
4. అర్జున్ కపూర్‌తో టైటిల్ పెట్టని బాలీవుడ్ మూవీ చేస్తోంది.
5. 'ఎటాక్' అనే సినిమాలో జాన్ అబ్రహాంతో కలిసి నటిస్తోంది.
6. ఇటీవలే 'మేడే' అనే సినిమాకు రకుల్ సంతకం చేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రధారులు.
Also Read