English | Telugu

సౌత్‌లో మేనేజర్ ఉంటే చాలు... హిందీలో అలా కాదట!

on Nov 12, 2019

 

తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ యంగ్ స్టార్ హీరోలు అందరితో రకుల్ నటించింది. తమిళంలో సూర్య, కార్తీతో సినిమాలు చేసింది. ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేసింది. 'దే దే ప్యార్ దే' తర్వాత రకుల్ నటించిన హిందీ సినిమా 'మార్ జవాన్'. ఇందులో ఆమె వేశ్యగా కనిపించనుంది. ఈ నెల 22న విడుదల సినిమా కానుంది. ఈ సందర్భంగా రకుల్ మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో సౌత్ ఇండస్ట్రీలకు, బాలీవుడ్‌కి డిఫరెన్స్ ఏంటో చెప్పింది. అవి ఆమె మాటల్లోనే... 

- రెండు ఇండస్ట్రీల్లోనూ ప్రొఫషనలిజం ఎక్కువ. రెండు భాషల్లోనూ స్టోరీటెల్లింగ్ మారుతోంది. సౌత్ ఇండస్ట్రీల్లో 9 గంటల నుండి 6 గంటల వరకు పని చేస్తారు. హిందీలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పని చేయాలి.
 
- సౌత్ ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలను నేను నేరుగా కలవాల్సిన అవసరం లేదు. నా తరపున మేనేజర్లు పని చక్కబెడతారు. బాలీవుడ్ లో అయితే కనిపించాలి. లేదంటే అవకాశాలు అంత త్వరగా రావు. పార్టీలకు వెళితే ఛాన్సులు వస్తాయని అనుకోవడం భ్రమ.


Cinema GalleriesLatest News


Video-Gossips