దిల్ రాజు కుర్రహీరోను తప్పించాడా..?
on May 5, 2016
యంగ్ హీరో రాజ్ తరుణ్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల మధ్య విభేదాలొచ్చాయా..? ఫిల్మ్ నగర్లో ఇప్పుడీ వార్త చక్కర్లు కొడుతోంది. షార్ట్ ఫిల్మ్ బేస్డ్ గా ఎంటరై ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్, రీసెంట్ గా మంచువిష్ణుతో చేసిన మల్టీస్టారర్ ఈడోరకం ఆడోరకం సినిమాలతో హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు రాజ్ తరుణ్. డైరెక్షన్ పై ఇంట్రస్ట్ తో పాటు, సినిమాల గురించి అవగాహన ఉండటం, కథను సెలక్ట్ చేసుకోవడంలో మంచి పట్టు ఉండటంతోనే ఈ కుర్రహీరో హిట్స్ కొడుతున్నాడనేది సినిమా విశ్లేషకులు చెప్పే మాట. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో శతమానంభవతి అనే సినిమాను చేస్తున్న రాజ్ కు ఆయనతో విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. సినిమా కథతో పాటు చాలా విషయాల్లో మనోడు వేలు పెడుతున్నాడని, ఇది దిల్ రాజుకు నచ్చలేదని దాంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నాడనే మాటలు వినబడుతున్నాయి. ఆల్రెడీ బౌండెడ్ అయిపోయిన స్క్రిప్ట్ లో ఎవరైనా వేలు పెడితే దిల్ రాజుకు అస్సలు నచ్చదని, అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడని అంటున్నారు. ఇది కేవలం పుకారు మాత్రమే అయితే ఫర్లేదు కానీ ఇది ఏమాత్రం నిజమైనా రాజ్ కెరీర్ కు ఇది డేంజర్ సిగ్నలే అని చెప్పాలి. కెరీర్లో ఒక స్థాయికి చేరుకున్న హీరోలు కూడా స్క్రిప్ట్ కు సంబంధించి కరెక్షన్ చెప్పాలంటే కాస్త ఆలోచిస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువహీరో, కాస్త నెమ్మదిస్తేనే బెటరేమో...!