టాక్సీవాలా దర్శకుడు... ఓ వెబ్ సిరీస్?
on Jun 30, 2020
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఎనిమిది నెలలుగా రచయితలతో కలిసి అతడు కొన్ని కథలు రెడీ చేసుకుంటున్నాడనీ, అందులో ఓ కథను వెబ్ కోసం చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 'టాక్సీవాలా' తరవాత నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శ్యామ్ సింఘ రాయ్' అనౌన్స్ చేశాడు రాహుల్. అయితే, ఆ సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పట్టేలా ఉండటంతో మధ్యలో ఒక వెబ్ సిరీస్ చేయాలనీ అనుకున్నాడట.
సెట్స్ మీదకు మళ్లీ సినిమాలు ఎప్పుడు వెళతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రపంచంలో ప్రతి రంగంతో పాటు సినిమా రంగం సైతం కొవిడ్19 వల్ల కుదేలైంది. ముఖ్యంగా యువ దర్శకుల కలలపై కరోనా నీళ్లు చల్లింది. ముఖ్యంగా కొత్త సినిమాలు ప్రకటించిన దర్శకులకు ఏం చేయాలో తెలియడం లేదు. అందుకని, వెబ్ సిరీస్ వైపు చూస్తున్నాడట.