ప్రియాంక-జోనాస్ దాంపత్యానికి రెండేళ్లు! ఫొటోలు షేర్ చేసిన కపుల్!!
on Dec 3, 2020
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ దంపతులుగా మారి డిసెంబర్ 2తో రెండేళ్లు పూర్తయ్యాయి. తమ సెంకడ్ వెడ్డింగ్ యానివర్సరీని వారు సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక, జోనాస్ వారి పెళ్లి ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రియాంక తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. "2 years down... forever to go" అనే క్యాప్షన్ జోడించారు.
నిక్ కూడా తన ప్రియమైన భార్యకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం, అటు క్రిస్టియన్ సంప్రదాయం జరిగిన మ్యారేజ్ ఫొటోలను షేర్ చేస్తూ.. "రెండు రోజులు.. రెండు సంప్రదాయాలు.. ఇప్పడు రెండేళ్లు. తన దేశంలోనే ప్రియాంకను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో.. నమ్మలేకపోతున్నా. Happy Hindu anniversary beautiful." అంటూ విషెస్ తెలిపాడు.
దీనికి ప్రియాంక స్పందించారు. కామెంట్స్ సెక్షన్లో "నా నిజ జీవితంలో బాలీవుడ్ హీరో.. ఐ లవ్ యు హ్యాండ్సమ్" అంటూ రాశారు. కొంతకాలం ప్రేమికులుగా గడిపిన ప్రియాంక, నిక్ 2018 డిసెంబర్ 2న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ భిన్న సంప్రదాయాలకు చెందిన వారు కావడంతో రెండు సంప్రదాయలనూ గౌరవిస్తూ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో వీరి వివాహ వేడుక జరిగింది.