ప్రియాంక చోప్రా చేతిలో మరో హాలీవుడ్ ఫిల్మ్
on Oct 28, 2020
పలు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యాక్టర్లలో ప్రియాంక చోప్రా ఒకరు. ఆమె లిస్ట్‌లో 'వియ్ కెన్ బి హీరోస్', 'ది వైట్ టైగర్' అనే రెండు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె జర్మనీలో 'మ్యాట్రిక్స్ 4' షూటింగ్లో పాల్గొంటోంది. వీటితో పాటు రుస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తోన్న వెబ్ సిరీస్ 'సిటాడెల్'లోనూ ఆమె ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రధారి. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన కొత్త రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌ను అనౌన్స్ చేసింది ప్రియాంక.
"జిమ్ స్ట్రౌజ్, శామ్ హ్యూఘన్, సెలీన్ డియాన్ లాంటి అద్భుతమైన నటులతో ఈ అమేజింగ్ మూవీని స్టార్ట్ చేయడానికి ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా. ఇది నా గౌరవం." అని తన ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసింది. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ మూవీకి తాత్కాలికంగా 'టెక్స్ట్ ఫర్ యు' అనే టైటిల్ నిర్ణయించారు. ఇంటర్నేషనల్ పోర్టల్ డెడ్‌లైన్ ప్రకారం, సోఫీ క్రామర్ నవల ఆధారంగా 2016లో వచ్చిన జర్మన్ ఫిల్మ్ 'ఎస్ఎంఎస్ ఫుర్ డిచ్'కి ఇది రీమేక్.
Also Read