ఈ సమ్మర్ దగ్గుబాటి స్టార్స్ తోనే..
on Jan 20, 2021
కథానాయికగా ప్రియమణిది 18 ఏళ్ళ ప్రాయం. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా సత్తా చాటింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. పెళ్ళయ్యాక కూడా సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రియమణి.. ఈ వేసవిలో తెలుగునాట రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో సందడి చేయనుంది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ దగ్గుబాటి స్టార్సే హీరోలు.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అసురన్ ఆధారంగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్పలో ప్రియమణి నాయికగా నటిస్తోంది. ఇక దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న పిరియడ్ డ్రామా విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో దర్శనమివ్వనుంది ప్రియమణి. ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం వేసవిలోనే సందడి చేయనున్నాయి.
మరి.. దగ్గుబాటి వారి బాబాయ్ - అబ్బాయ్ చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే నటిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ కి ఆయా చిత్రాలు ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
నారప్పకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. విరాటపర్వంని వేణు ఊడుగుల రూపొందిస్తున్నాడు.
Also Read