ప్రియమణి భర్తకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసు!
on Aug 12, 2020
ప్రియమణి... ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకున్నారు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా... ‘ఢీ’ షోతో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం వెంకటేష్ సరసన ‘నారప్ప’లో కథానాయికగా, వెంకీ అన్న కుమారుడు రానా ‘విరాటపర్వం’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులతో ముచ్చటించారు. అప్పుడు సరదా సంభాషణ ఒకటి చోటు చేసుకుంది.
‘బాయ్‌ఫ్రెండ్ లేదా భర్త’ (ఇద్దరిలో ఎవరిని కోరుకుంటారు అనే అర్థంలో) అని ఒకరు ప్రశ్న అడిగారు. అందుకు ‘‘భర్తే... అతనే నా బాయ్‌ఫ్రెండ్’’ అని ప్రియమణి బదులిచ్చారు. వెంటనే ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ లైనులోకి వచ్చారు. ‘నీ బాయ్‌ఫ్రెండ్ ఎవరు?’ అని అడిగారు. ‘నీకు తెలుసు ముస్తఫా’’ అని సిగ్గుపడుతున్న ఎమోజీలను ప్రియమణి పోస్ట్ చేశారు. ఇంకా పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.
చిన్నతనంలో ఎయిర్ హోస్టెస్ లేదా హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటున్నట్టు ప్రియమణి తెలిపారు. లాక్డౌన్లో ఇల్లు క్లీన్ చేయడం, తినడం చేశానని ఆమె అన్నారు. ‘మీరు ప్రెగ్నెంటా?’ అని ఎవరో అడగ్గా... ‘అవును... ఫుడ్ కోమా’’ అని వెటకారంగా రిప్లై ఇచ్చారు. ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ప్రెగ్నెంట్‌గా అనిపిస్తున్నారట.