పెద్ద సీజన్లకి ప్రభాస్ డబుల్ ధమాకా
on Mar 13, 2018
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం పాపులర్. బాహుబలి సినిమాతో దేశం మొత్తం క్రేజ్ సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం మరో హై బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సాహో లో ప్రభాస్ తన స్టంట్ లతో అలరించనున్నాడు. దుబాయ్ లో షూటింగ్ పర్మిషన్స్ రాకపోవడంతో డిలే అయినా ఈ సినిమా ని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్లో ఆక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నారు. మొదట, సాహో ని 2018 ప్రథమార్ధంలో రిలీజ్ చేద్దాం అనుకున్నా, షూటింగ్ లో జాప్యం మూలంగా సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్యలో జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ తో ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడు. డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి, సంక్రాంతి కి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. సో, ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి జరగనుంది. మొత్తానికి, సినిమా ఇండస్ట్రీ కి అతి పెద్ద సీజన్లయిన సంక్రాంతి, సమ్మర్ లకి 2019 లో ప్రభాస్ డబల్ ధమాకా సిద్ధం చేస్తున్నాడు.