సలార్.. ప్రభాస్ పాత్ర అదేనా?
on Dec 3, 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం సలార్. పాన్ ఇండియన్ వెంచర్ గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన, ఫస్ట్ లుక్ బుధవారం వెలువడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. సలార్ లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో సామాన్యుల హక్కుల కోసం పోరాడే శక్తిమంతమైన అండర్ వరల్డ్ డాన్ గా డార్లింగ్ దర్శనమిస్తారట. స్టైలిష్ గా సాగే ఈ పాత్రలో ప్రభాస్ నటన సినిమాకే ప్రధాన బలంగా నిలుస్తుందని వినికిడి. యాక్షన్ సాగాగా తెరకెక్కనున్న సలార్.. 2021 చివరలో లేదా 2022 ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
కాగా, సలార్ అంటే హింసాత్మక వ్యక్తి అనే అర్థముందట. ప్రభాస్ పాత్ర రీత్యా ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని బజ్.