ఇక తమిళనాట ప్రభాస్... ‘చంద్రమౌళి’?
on Oct 11, 2017
ప్రభాస్ ఇప్పుడు జాతీయ నటుడు. ‘బాహుబలి’ సినిమాలు ప్రభాస్ ని ఆ స్థాయిలో నిలబెట్టాయ్. ఇప్పుడు ఇండియా వైడ్ లో ప్రభాస్ కి అభిమానులున్నారు. ప్రభాస్ సినిమా అంటే... ఇరగబడి చూసే ఫ్యాన్స్ కి దేశవ్యాప్తంగా కొదవ లేదు. అందుకే... ప్రభాస్ నటించిన పాత హిట్ సినిమాలు ఇప్పుడు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయ్.
గురువారం ‘చంద్రమౌళి’ పేరుతో ప్రభాస్ నటించిన ఓ పాత హిట్ సినిమా తమిళంలో విడుదల కానుంది. ఇంతకీ ఆ పాత హిట్ ఏంటో చెప్పనేలేదు కదూ... అదే ‘ఛత్రపతి’. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఛత్రపతి’ తమిళ నాట ‘చంద్రమౌళి’ పేరుతో విడుదల కానుంది. అలాగే... త్వరలో మలయాళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయ్. ‘‘బాహుబలి‘ఫేం ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం’ అని ట్యాగ్ తగిలించి తమిళ, మలయాళంలలో ప్రభాస్ సినిమాలు విడుదల చేయడానికి సన్నాహలు జరుగుతున్నాయ్. ఇది నిజంగా ప్రతి తెలుగోడూ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటారు?