ప్రభాస్.. జస్ట్ 4 నెలల్లోపే వస్తున్నాడు బాస్!
on Mar 1, 2021
`మిర్చి` ముందు వరకు ఏడాదికి ఒక సినిమాతోనైనా పలకరిస్తూ వచ్చేవాడు ప్రభాస్. అయితే.. `మిర్చి` తరువాత ఆ లెక్క మారింది. రెండేళ్ళకో సినిమా అన్న చందాన ప్రభాస్ నుంచి మూవీస్ వస్తున్నాయి. అదంతా.. `బాహుబలి` సిరీస్ ఎఫెక్ట్ తో వచ్చిన పాన్ - ఇండియా ఇమేజ్ వల్లే అన్నది స్పష్టం. కట్ చేస్తే.. `రాధేశ్యామ్` నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్లానింగ్ మారుతోంది. మునుపటిలా తక్కువ గ్యాప్ లోనే తన చిత్రాలు సందడి చేయనున్నాయి. మరీ ముఖ్యంగా.. 2022లో కేవలం నాలుగు గ్యాప్ లో రెండు సినిమాలతో ఎంటర్ టైన్ చేయనున్నాడు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న యాక్షన్ సాగా `సలార్` ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక `తానాజీ` డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ప్రభాస్ చేయబోతున్న మైథలాజికల్ టచ్ మూవీ `ఆదిపురుష్` అదే క్యాలెండర్ ఇయర్ లో ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంటే.. జస్ట్ 4 నెలల్లోపే ప్రభాస్ రెండు సినిమాలతో వినోదాలు పంచబోతున్నాడన్నమాట. ఇది నిజంగా అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే. ఇక మీదట కూడా ఇదే ఫార్ములాని ప్రభాస్ కొనసాగిస్తాడేమో చూడాలి.
కాగా `రాధేశ్యామ్`కి, `సలార్`కి మధ్య మాత్రం ఎనిమిదన్నర నెలల గ్యాప్ ఉండడం గమనార్హం.