పవర్‌స్టార్ బ్రాస్లేట్ తీసుకున్న స్టార్ యాంకర్
on Oct 28, 2016
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల్లో కూడా బోల్డెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఆయన్ను కనీసం దూరం నుంచైనా చూడాలని కోరుకోనివారు ఉండరు. ఆ ఛాన్స్ రానివారు ఏం చేస్తారు పవన్ ఫోటోని పర్స్‌లో పెట్టుకోవడమో..లేదంటే పచ్చబొట్టు పొడిపించుకోవడం కాని చేస్తారు. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి కూడా పవన్‌పై తన అభిమానాన్ని వెరైటిగా చాటుకుంది. పవర్‌స్టార్ బ్రాస్లెట్ను తన చేతికి ధరించి సోషల్ మీడియాలో ఆ పిక్‌ను పోస్ట్ చేసింది. ఇది పవర్‌స్టార్ అభిమానుల కంటపడటంతో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. అయితే ఆ బ్రాస్లెట్ శ్రీముఖిది కాదట.. తన మేకప్‌మెన్ మున్నాదట. అతని దగ్గర నుంచి తీసుకుని దానిని తన చేతికి తొడుక్కొని తెగ మురిసిపోతోంది శ్రీముఖి.