పవన్ ని చూసి భయపడుతున్నారు
on Aug 29, 2016
తిరుపతిలో స్పీచ్ తరవాత... పవన్‌ని ఫ్యాన్స్ మరింత పెరుగుతున్నారు. పవన్ స్పీచ్ అద్భుతంగా ఉందని, ఇప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడడం ఖాయమని... పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నటుడు శివాజీ కూడా అదే మాట చెబుతున్నాడు. గత రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడు శివాజీ. పవన్ తో కలసి పనిచేయడానికి రెడీగా ఉన్నానని.. మరోసారి సెలవిచ్చాడీయన. అంతేకాదు... పవన్‌ని చూసి అందరూ భయపడుతున్నారని, అందుకే... పవన్‌ని విమర్శిస్తూ కూర్చున్నారని, ఇప్పటికైనా మించిపోయింది లేదని, వాళ్లంతా పవన్ తో కలసి పనిచేయడానికి ముందుకు రావాలని శివాజీ కోరుతున్నాడు. నిజానికి ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడమని పవన్‌కి చాలాసార్లు చెప్పాడట శివాజీ. కానీ పవన్ స్పందించలేదని, కాస్త ఆలస్యమైనా బయటకు వచ్చి పవన్ గురించి మాట్లాడడం సంతోషాన్ని కలిగించిందని, పవన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని శివాజీ చెప్పుకొచ్చాడు. త్వరలో కాకినాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నాడు. ఆ సభకి శివాజీ వస్తాడేమో చూడాలి.