పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్ళలేదంటే?
on Aug 14, 2020
నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఎందుకు గైర్హాజరు అయ్యారనేది అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులలో చర్చకు దారి తీసింది. నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కి వెళ్లి, అన్న కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లలేదని అనుకున్న ప్రజలు తక్కువేం కాదు. అయితే, పవన్ వెళ్ళకపోవడానికి ప్రత్యేక కారణం ఉందట.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. దీక్షలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం ఆరు తరవాత ప్రత్యేక పూజలు చేస్తున్నారట. నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ఉదయం కాబట్టి వెళ్ళారనీ, నిహారిక నిశ్చితార్థ వేడుక సాయంత్రం ఆరు తరవాత జరిగింది కాబట్టి వెళ్ళలేదని జనసేన పార్టీ, పవన్ సన్నిహిత వార్తలు చెబుతున్నాయట. నాగబాబు ఇంటికి గురువారం పగటిపూట వెళ్ళిన పవన్, అసలు విషయం అన్నయ్యకు చెప్పారట. అలాగే, నిహారికకు అశీసులు అందజేసి వచ్చారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 2003 నుండి తాను ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తున్నట్టు పవన్ తెలిపారు. ఇన్నాళ్ళూ వ్యక్తిగత కారణాల వల్ల చేసిన తాను, ఈసారి ప్రపంచం బావుండాలని చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read