ENGLISH | TELUGU  

అప్పుడు 'పాయల్ నాట్ ఫిట్' అన్నారు.. ఇప్పుడు టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నయ్యాను!

on Oct 10, 2019

 

'ఆర్ఎక్స్ లవ్' సినిమాకు ముందు ముంబైలో ఆరేళ్లు చాలా స్ట్రగులయ్యాననీ, ఆడిషన్ చేసిన డైరెక్టర్లు 'పాయల్ నాట్ ఫిట్' అనేవాళ్లనీ, కనీ ఇవాలా సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నిగా పేరు తెచ్చుకున్నానంటూ ఉద్వేగానికి గురైంది పాయల్ రాజ్‌పుత్. ఆమె హీరోయిన్‌గా నటించిన 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాయల్ ఉద్వేగభరితంగా మాట్లాడింది.

"మీ అందరూ నాకు చాలా ప్రేమ పంచుతున్నారు. నేనివాళ ఇలా ఉన్నానంటే కారణం మీరే. 'ఆర్ఎక్స్ 100' నా లైఫ్‌ను మార్చేసింది. ఇక్కడో విషయం చెప్పాలి. నాకు ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డం వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు. దానికి ముందు నేను ఆరేళ్లు ముంబైలో చాలా స్ట్రగులయ్యాను. సౌత్ నుంచి వచ్చిన డైరెక్టర్లు ఆడిషన్‌కు పిలిచేవారు. చివరకు 'పాయల్ నాట్ ఫిట్' అని చెప్పేవాళ్లు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. చెప్పాలంటే కొంచెం డిప్రెషన్‌కు కూడా గురయ్యేదాన్ని. విధి నావైపు ఉంది. అందువల్లే ఇవాళ సౌత్ ఇండియాలోని టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్ని అయ్యాను. ఇది నాకు లభించిన గౌరవం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా. గత ఏడాది సెప్టెంబర్‌లో డైరెక్టర్ భాను 'ఆర్డీఎక్స్ లవ్' స్క్రిప్ట్ వినిపించారు. కంటెంట్ అమేజింగ్ అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, వార్నింగ్ ఉన్న కంటెంట్. 'ఈ మూవీ నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు?' అనుకున్నా. అందుకే ఈ సినిమాకు సంతకం చేశాను. షూటింగ్ అంత ఈజీగా జరగలేదు. పోలవరంలోని పాపికొండ గ్రామంలో 45 రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేశాం. అక్కడ నెట్‌వర్క్ లేదు, మంచి ఫుడ్ లేదు, ఒక్క హోటల్ లేదు, ఏసీ లేదు. అయితే దానికి నేనేమీ బాధపడలేదు. అక్కడున్నంత కాలం చాలా ఎంజాయ్ చేశాను. నేను రాత్రిపూట అర లీటర్ పాలు తాగుతాను. అక్కడ పాలు బాగా దొరికేవి. ఈ సినిమా నా కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఏ యాక్టర్ కెరీర్‌లోనైనా ఇలాంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. సెట్స్‌పై ఒకరి ముందు నేను క్యారెక్టర్ ఆర్టిస్టుని అయిపోయేదాన్ని. ఆ వ్యక్తి సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్. ఆయన నాకు తండ్రితో సమానం. ఒకరోజు ఆయన నన్ను 'శ్రీదేవి గారూ' అని పిలిచారు. ఇప్పటి దాకా నా మొత్తం కెరీర్‌లో నేనందుకున్న గొప్ప కాంప్లిమెంట్ అది. నాకింత మంచి పేరునూ, కీర్తినీ ఇచ్చిన తెలుగు సినిమాకు థాంక్స్" అని చెప్పుకొచ్చింది పాయల్.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.