ఎన్టీఆర్...‘ఆర్ఆర్ఆర్’కు లీకుల బెడద...
on Jan 25, 2020
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చిన్న నిక్కరులో ఉన్న ఫొటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఆల్మోస్ట్ వైరల్ అయింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పిరియాడిక్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ స్టిల్ అది. ఆ స్టిల్ ఒక్కటే కాదు... ఒక వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. అదీ ఎన్టీఆర్‌దే. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ రంగంలోకి దిగింది. కాపీ రైట్ యాక్ట్ కింద ఆ ఫొటోలు, వీడియో డిలీట్ చేయిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్ లీక్ కావడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు అరకు దగ్గరలోని పాడేరులో షూటింగ్ చేస్తే... సాయంత్రానికి లొకేషన్లో ఎన్టీఆర్ స్టిల్స్ బయటకొచ్చాయి.
లేటెస్టుగా లీకైన వీడియోలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో తెలంగాణ విప్లవ యోధుడు కోమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. టైగర్‌తో ఫైట్ చేసే సీన్‌ను ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్‌గా ప్లాన్ చేశారు. అదే ఇప్పుడు లీకైంది. లీకులను అరికట్టడానికి దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, అవేవీ ఫలితాలను ఇవ్వడం లేదు. ‘బాహుబలి’కి కూడా రాజమౌళి లీకులను ఎదుర్కొన్నాడు. ఆ అనుభవంతో ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా లీకుల బెడద తప్పడం లేదు.