ENGLISH | TELUGU  

సహాయంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు ఎక్క‌డ‌?

on Mar 27, 2020

 

ప్రధాని మంత్రి సహాయ నిధికి కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధులకు కావచ్చు. సినీ కార్మికుల సంక్షేమానికి కావచ్చు... ప్రభాస్ రూ. 4 కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్  రూ. 2 కోట్లు, చిరంజీవి, మహేష్ బాబు కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఎన్టీఆర్ రూ. 75 లక్షలు, రామ్ చరణ్ రూ. 70 లక్షలు, నితిన్, 'దిల్' రాజు, త్రివిక్రమ్ రూ. 20లక్షలు చొప్పున... సాయి తేజ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి  రూ. 10 లక్షలు చొప్పున ఇచ్చారు. పైన చెప్పుకొన్న వారందరూ గురువారం సహాయం ప్రకటిస్తే... అల్లు అర్జున్ శుక్రవారం స్పందించారు. రూ. 1.25 లక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు ఇస్తున్నట్టు తెలిపారు.

కరోనా నేపథ్యంలో కష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్పందిస్తున్నారు. అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఇంకా సహాయ సహకారాలు, విరాళాల విషయంలో స్పందించలేదు. అక్కినేని, అల్లు, దగ్గుబాటి ఫ్యామిలీల నుండి కూడా ఎలాంటి విరాళాలు రాలేదు.

దగ్గుబాటి ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు వెంకటేష్, రానా, ఒక నిర్మాత సురేష్ బాబు ఉన్నారు. వీళ్ల ఫ్యామిలీకి స్టూడియోలు ఉన్నాయి. సినిమాలు నిర్మిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, థియేటర్లు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ మీద కోట్ల టర్నోవర్ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను వెంకటేష్ చెప్తున్నారు కానీ ఇప్పటివరకు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎవరూ విరాళం ఇవ్వలేదు.

అక్కినేని ఫ్యామిలీలో ముగ్గురు హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్, ఒక హీరోయిన్ సమంత, నటి అమల ఉన్నారు. మేనల్లుళ్లను కూడా లెక్కేస్తే... సుమంత్, సుశాంత్ ఉన్నారు. స్టూడియోలు ఉన్నాయి.  చాలా సినిమాల విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇండస్ట్రీ మీద అక్కినేని ఫ్యామిలీకి వచ్చే ఆదాయం ఎక్కువే. వాళ్ళు కూడా సహాయం గానీ, విరాళం కానీ ప్రకటించలేదు. ఎమ్మెల్యే, హీరో  నందమూరి బాలకృష్ణ విరాళం విషయంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోటి రూపాయలు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. కానీ, ఆయన నుండి అధికారిక ప్రకటన రాలేదు.

కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. ఒకవేళ అలా సహాయం చేశారేమో... ఎవరికీ తెలియదు. నలుగురికి తెలిసేలా ఈ పెద్దలు విరాళం ఇస్తే... వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి తమవంతుగా ఎంతోకొంత సహాయం చేయవచ్చు. అది గమనిస్తే మంచిది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.