నితిన్ "లై" ప్రీమియర్ షో టాక్
on Aug 11, 2017
ఇవాళ రిలీజవుతున్న మూడు సినిమాల్లో నితిన్ "లై" సినిమా ఫస్ట్ లుక్ నుంచే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీగా పేరు తెచ్చుకుంది. నితిన్ లుక్ ట్రెండీగా ఉండి..యూత్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టింది. దీంతో ఈ మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే " లై " సినిమాను ఒకరోజు ముందే చూశారు ఓవర్సీస్ ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో అక్కడి జనాలు లై గురించి ఏం రిపోర్ట్ ఇచ్చారో చూద్దాం. పద్మనాభం ( అర్జున్) ఒక ఇంటెలిజెంట్ బిజినెస్మెన్..కాగా అతను ఒక వస్తువు కోసం వెతుకుతూ ఉంటాడు..అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకుండా ఎప్పుడూ అబద్ధాలు చెప్పే కుర్రాడు సత్యం (నితిన్) . ఆ గుర్తు తెలియని వస్తువు కోసం వీరిద్దరి మధ్య జరిగే మైండ్గేమే సినిమా.
ఈ మూవీలో మేజర్ పార్ట్ మొత్తం అమెరికాలోనే షూట్ చేశారు. నితిన్ తన గత చిత్రాలతో పోలిస్తే నటనలోనూ..డైలాగ్ డెలివరీలోనూ ఎంతో పరిణితి చూపించాడట. ఇక సీనియర్ నటుడు అర్జున్ విలనిజం మూవీకే హైలెట్గా నిలిచిందట. హీరోయిన్ మేఘా ఆకాశ్ మంచి అభినయాన్ని కనబరిచింది. ఇక సినిమా మొత్తాన్ని స్టైలిష్ అండ్ యాక్షన్ మోడ్లో టేకింగ్ చేశాడు దర్శకుడు హనురాఘవపూడి. అయితే కామెడీ లేకపోవడం సినిమాకు మైనస్ అంటున్నారు ప్రేక్షకులు..ఇలాంటి కథలకు ఎలాగూ టార్గెట్ ఆడియన్స్ ఉండటం..వరుస సెలవులు కావడంతో లై కలెక్షన్స్ దుమ్ములేపే అవకాశం ఉంది.