ఆన్లైన్లో వైరల్ అయిన నిహారిక వివాహ శుభలేఖ
on Dec 2, 2020
నిహారిక కొణిదెల, ఆమె ఫియాన్స్ చైతన్య జొన్నలగడ్డ డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో విలాసవంతమైన హోటల్లో వివాహం చేసుకోబోతున్నారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో లాక్డౌన్ సందర్భంగా ఈ జంట నిశ్చితార్ధం జరిగింది. కాగా నిహారిక వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆన్లైన్లో లీకైన ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ద్వారా నిహారిక, చైతన్య వివాహానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడయ్యాయి. రాయల్ ఉదయ్‌విలాస్‌లో ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవనున్నారు.
డిసెంబర్ 9 సాయంత్రం 7:15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నాడు. 8:30 గంటలకు డిన్నర్ సర్వ్ చేస్తారు. అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 11న నిహారిక తండ్రి నాగబాబు ఇండస్ట్రీలోని మిత్రులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లోగా తన వివాహాన్ని పురస్కరించుకొని, కాబోయే భర్త చైతన్యతో పాటు తన ఫ్రెండ్స్‌కు నిహారిక చిన్న పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్చర్‌ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నిహారిక, చైతన్య కుటుంబాలు రెండూ ఉదయ్‌పూర్‌కు చేరుకొని, వివాహానికి ముందు క్వారంటైన్లో ఉండనున్నారు.
Also Read