English | Telugu

శోభన జన్మదినం

on Mar 20, 2019

 

 

తన నాట్యంతోను నటనతోను తెలుగు సినీ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన సినీ నటి శోభన గారికి తెలుగు వన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.... శోభన గారి గురించి ప్రేక్షకులందరికీ గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం....

1966 మార్చి 21 వ తేదీన  జన్మించారు. నటన లోను నాట్యం లోను ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణులకు ఈమె  మేనకోడలు. చిన్న నాటి నుంచి నాట్యం పట్ల ఆసక్తి పరురాలైన ఈమె 1980లలో భారత దేశ ప్రథిభావంతులైన కళాకారిణులలో ఒకరిగా ఖ్యాతిపొందారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందారు. ఆమె గురువు చిత్రా విశ్వేశ్వరన్. భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించటంలో ఎంతో ప్రావీణ్యత సాధించారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోను నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.  1985లో  నాగార్జున హీరోగా పరిచయమైన విక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. 

అది మొదలు వరుసగా....చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలక్రిష్ణతో మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారీ, అల్లుడు గారు, మోహన్ బాబుతో రౌడీగారి పెళ్ళాం సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె అభినందన, విజ్రుంభణ, అజేయుడు, కోకిల, ఏప్రిల్ 1 విడుదల, అప్పులఅప్పారావు, రక్షణ, హలోడార్లింగ్, నిప్పురవ్వ, సూర్యపుత్రులు, గేమ్, త్రిమూర్తులు, అల్లుడుదిద్దిన కాపురం సినిమాల్లో కూడా నటించారు.

తెలుగుతో పాటు తమిళ్, మళయాళ, హిందీ సినిమాల్లో కూడా ఈమె నటించారు. ఈమెకు మలయాళ చిత్రం మణిచిత్రతాళుకు  ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత 2001లో దక్షిణాది నటి రేవతి దర్శకత్వంలో వచ్చిన మిత్ర మై ఫ్రెండ్ సినిమాకి రెండవసారి జాతీయ ఉత్తమనటి అవార్డు వచ్చింది. 1994లో ఈమె కళార్పణ అనే సంస్ధకు అంకురుర్పణ చేసి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ.... భారతదేశమంతటా న్రుత్యవార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. నటనతో పాటు నర్తన పట్ల కూడా ఇంత ఆసక్తి చూపిన శోభన గారు ఎందరికో ఆదర్శనటిగా నిలుస్తారని ఆశిస్తూ....ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... ఈ కార్యక్రమం ఇక్కడితోముగిస్తున్నాం...


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here