ఇంతకీ ఆమె చేత దెబ్బలు తిన్న స్టార్ హీరో ఎవరు?
on Mar 15, 2018
రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర తో సౌత్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. లెజెండ్ మరియు లయన్ సినిమాల్లో స్టార్ హీరో బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి లో లీడ్ రోల్ చేసే అవకాశం అంది పుచుకుంది. సౌత్ లో డీగ్లామర్ రోల్స్ చేసి మెప్పించిన రాధికా, బాలీవుడ్ లో మాత్రం గ్లామరస్ రోల్స్ లో కవ్వించింది. పార్చుడ్, ఫోబియాల్లో తన అందచందాలతో యువకులు మతులు పోగొట్టిన రాధికా, తర్వాత సౌత్ హీరోలపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ఒక హిందీ టీవీ షో లో పాల్గొన్న రాధికా ఒక సౌత్ హీరోపై తీవ్ర విమర్శలు చేసింది. సెట్లో తాను కూర్చొని ఉండగా, ఆ హీరో వచ్చి తన కాళ్ళని నిమిరాడని... తట్టుకోలేక చెంప పగలగొట్టానని వివరించింది. ఇంతకీ, రాధికా చేత చెంప దెబ్బలు తిన్న ఆ సౌత్ స్టార్ ఎవరు అని సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతుంది. మొన్నామధ్య బీచ్ లో బికినీ ఫోటోలు దిగి విమర్శలపాలయిన రాధికా, బీచ్ లో బికినీ కాకపోతే చీర కట్టుకుంటారా అని విమర్శకులపై తన స్టైల్ లో స్పందించింది. కాంట్రవర్సీలకి కేంద్రబిందువుగా మారిన రాధికా ప్రస్తుతం తమిళ్లో ఒకటి, హిందీలో మరో సినిమా చేస్తుంది.