టాలీవుడ్లోనే తొలిసారి.. ఒకే రోజు 13 సినిమాలు రిలీజ్
on Dec 14, 2017
బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా వీకెండ్‌ని టార్గెట్ చేసుకుని శుక్రవారం పూట ఎన్ని మూవీ రిలీజ్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు దర్శకనిర్మాతలు. అలా ఒకటి లేదా రెండు.. మహా అయితే మూడు సినిమాలు. అలాంటిది ఏకంగా 13 సినిమాలు రిలీజైతే.. ఈ అరుదైన ఘటన రేపు జరగబోతోంది.. అది కూడా మన టాలీవుడ్లోనే. ఒక వారం దాటితే పెద్ద సినిమాల సందడి మొదలవుతుండటం.. ఆ తర్వాత సంక్రాంతి సందడితో ధియేటర్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో.. చిన్న నిర్మాతలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయ్యారు.
అంతా ఒకే మాట మీద ఉండటంతో.. ఈ శుక్రవారం రికార్డు స్థాయిలో పదమూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సీత, కుటుంబ కథా చిత్రమ్, జూలియట్ లవరాఫ్ ఇడియట్, 10, మామా ఓ చందమామ, పడిపోయా నీ మాయలోనే, కిస్ కిస్ బాంగ్ బాంగ్, ఇదీ మా ప్రేమకథ, ఉందా లేదా, తొలి పరిచయం, లచ్చి, ప్రేమపందెం, మరో దృశ్యం చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఈ చిన్న సినిమాల్లో ఏవి ఆడియన్స్‌ని ధియేటర్రి రప్పిస్తాయో వేచి చూడాలి.