మెగా డాటర్ కుమ్మేసింది!
on Oct 20, 2017
ఇక్కడున్న ఈ ఫొటోను ఒక్కసారి చూడండి.. నిజంగా అభినందించకుండా ఉండలేం. వాళ్లెవరో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిన్న కుమార్తె.. శ్రీజ, ఆమె భర్త ఎన్నారై బిజినెస్ మేన్ కల్యాణ్. వీరిద్దరితో పాటు ఓ పాప కూడా ఉంది చూశారా? అదే.. కల్యాణ్ ఎత్తుకున్న పాప!. ఆ పాప ఎవరో కాదు... శ్రీజ కుమార్తె. ఆమె మొదటి వివాహం వల్ల పుట్టిన కుమార్తె. ఆమెను కల్యాణ్ ఎత్తుకున్న తీరు.. వారి ముఖాల్లో ఆనందం.. నిజంగా దీపావళి అంటే ఇది కదా! అనిపిస్తుంది కదూ.
ఈ కుటుంబాన్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. నివృతిని కల్యాణ్ ఎత్తుకున్న తీరు చూస్తే... ఓ అందమైన కథ రాయాలనిపిస్తుంది. జీవరాసులన్నింటిలో మనిషి కూడా ఉంటాడు. కానీ... మనిషిని జీవరాలసులన్నింటితో పాటు విడదీసేది మనసు.. మానవత్వం.. మంచితనం. ఈ ఫొటోలో అదే కనిపిస్తుంది. అందుకే... నెటిజన్లందరూ ఈ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది చాలా బావుంది’ అని కామెట్లు పెడుతూ.. సంబరపడిపోయారు. ఈ జంట ఇలాగే నిండు నూరేళ్లు ఉండాలని ఆశిద్దాం.
ఇదిలావుంటే... కల్యాణ్ ప్రస్తుతం డాన్స్, కరాటే.. తదితర విషయాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. కారణం... అతను త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సో... మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో తెరకు పరిచయం కానున్నాడనమాట. కల్యాణ్ హీరోగా సక్సెస్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కుర్రాడు బావుంటాడు. కాస్త టాలెంట్ కూడా తోడైతే.. భుజానేసుకొని మోయడానికి కోట్లాది మెగా ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు కదా. బెస్ట్ ఆఫ్ లక్ కల్యాణ్.