జై లవకుశకు పెద్ద షాక్..ఇది ఎవరి పని..?
on Jun 27, 2017
బాబీ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశను అనుకున్న టైంలో రిలీజ్ చేసేందుకు నిర్మాత కళ్యాణ్ రామ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే బాబీ కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా టైట్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. దీంతో చిత్రయూనిట్, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. సరిగ్గా ఈ టైంలో వీరిని కలవరపెట్టే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలోని పాటగా చెబుతూ పిల్లా నువ్వే నా ట్వింకిల్..ట్వింకిల్" లిరిక్ సోషల్ మీడియాలో లిక్ అయ్యింది. ఇంకేముంది ఎన్టీఆర్ అభిమానులు దీనిని తెగ షేర్ చేసేస్తున్నారు. అయితే ఇది నిజంగానే జై లవకుశ మూవీలోని పాట..లేక ఎవరైనా పబ్లిసిటీ కోసం కావాలని సృష్టించారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా ఈ సినిమాలోని పాట అయితే కనుక చిత్ర యూనిట్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి.