తండ్రి అయిన నాని.. రెండు పండుగలు ఒకేసారి..
on Mar 29, 2017
నేచురల్ స్టార్ హీరోకి ఈరోజు ఉగాది పండుగతో పాటు మరో పండుగ కూడా కలిసివచ్చినట్టైంది. ఉగాది పర్వదినాన నాని తండ్రి అయ్యాడు. నాని సతీమణి అంజన పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పీఆర్వో మహేష్ కోనేరు ట్విటర్ ద్వారా తెలుపుతూ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంజన మగ శిశువుకు జన్మనిచ్చారట. కాగా 2012లో నాని, అంజన ప్రేమ వివాహం చేసుకున్నారు. మొత్తానికి వరుస హిట్లతో దూసుకుపోతున్న నానికి ఇది గుడ్ న్యూసే కదా మరి. నాని తర్వాతి చిత్రం షూటింగ్ కోసం విదేశానికి వెళ్లి కొద్దిరోజుల క్రితమే తిరిగివచ్చారు.
Also Read