గ్యారేజ్ టికెట్ రేటేంతో తెలుసా..?
on Aug 31, 2016
తెలుగు నాట స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ సందడి మామూలుగా ఉండడు. రిలీజ్‌కు ముందే బ్యానర్లు , కటౌట్ల హంగామాతో పాటు టిక్కెట్ల కోసం నానా హైరానా పడతారు అభిమానులు. తమ అభిమాన నటుడి సినిమాని అందరికంటే ముందే చూడాలని తహతహలాడతారు ఫ్యాన్స్. ఆ టైంకి తెలుగునేల మీద ఉన్నా లేకున్నా పరాయిగడ్డ మీద ఉన్నా ఇదే ఉత్సాహం. దీనికి తాజా ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా రేపు ధియేటర్లలోకి వస్తుండటంతో ఇవాళ అర్థరాత్రి ఒంటి గంటకు, నాలుగు గంటలకు రెండు షోలను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం యూనివర్శిటీలో గ్యారేజ్ బెనిఫిట్ షో టికెట్లను తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం వేలం వేసింది. ఆ వేలంలో ఫస్ట్ టికెట్‌ను రూ.31 వేలకు ఒక అభిమాని దక్కించుకున్నాడు. ఇక సెకండ్ టికెట్ రూ.17,500కు, మూడో టికెట్‌ను రూ.13,000లకు దక్కించుకున్నారు.