జనతా గ్యారేజ్ కథ ఇదేనా..?
on Aug 31, 2016
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా..కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా ధియేటర్లలోకి రావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే ధియేటర్లలో సందడి నెలకొంది. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాకు జనతా గ్యారేజ్ అని టైటిల్ ఎందుకు పెట్టారో ఒక్కసారి చూద్దాం. 1980 ప్రాంతంలో దేశ రాజకీయాలతో పాటు ఎక్కడ చూసినా జనతా అన్న పదం ఫుల్ ఫేమస్. జనతా పార్టీలు, జనతా ప్రభుత్వం..జనతా ఖాదీ..జనతా టైలర్..జనతా వస్త్రాలు ఇలా ఎక్కడ చూసినా జనతామయమే. జనతా అంటే జనం గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం. ఈ సినిమా కథ కూడా జనం గురించే ఉంటుంది కాబట్టి కథ రాసేటప్పుడే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించాడు.