సమంతపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్
on Aug 31, 2016
పాపం... సమంత...! ఈమధ్య సమంతని మీడియా టార్గెట్ చేస్తూ.. హాట్ హాట్ వార్తలు రాసుకొంటూ వస్తోంది. వాటికి సమంత కూడా అలవాటు పడిపోయింది. ఇప్పుడు సమంతని అక్కినేని ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. సమంతకు టెక్కు బాగా ఎక్కువైపోయిందని గోల గోల చేస్తున్నారు. చేయని తప్పుకి సమంత శిక్ష అనుభవిస్తోంది. ఇంతకీ ఏమైంది? సమంతపై అక్కినేని అభిమానులకు కోపం ఎందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ని తెగ పొగిడేసింది సమంత. తాను కలసి నటించిన తొలిస్టార్ హీరో ఎన్టీఆర్ అంటూ.. పొరపాటున నోరు జారింది. సమంత తొలి చిత్రం ఏం మాయ ఏశావె. ఆ సినిమా సూపర్ హిట్టవవ్వడంతో ఎన్టీఆర్ బృందావనంలో నటించే ఛాన్స్ అందుకొంది సమంత. అప్పటి నుంచి సమంత జాతకమే మారిపోయింది. అయితే... నాగచైతన్యకి అప్పటికి హిట్స్ లేవు. అందుకే... నేను నటించిన తొలి స్టార్ హీరో.. ఎన్టీఆర్ అంది. నాగచైతన్య స్టార్ కదా?? చైతూ ఏమైనా చిన్న హీరోనా? అన్నది అక్కినేని ఫ్యాన్స్ ప్రశ్న. ఫ్యాన్సంతా ఇక్కడే హర్ట్ అయ్యారు. మరి సమంత తన తప్పుని ఎలా సరిదిద్దుకొంటుందో చూడాలి.