అసిన్ ఇల్లు హౌస్ ఫుల్ అయిపోయింది..!
on May 25, 2016
తను నటించిన సినిమా తరహాలోనే, అసిన్ పెళ్లి చేసుకుంది. ఒక పెద్ద సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ ను చేసుకునే పాత్రను గజినీలో పోషించింది అసిన్. ఆ తర్వాత నిజంగానే మైక్రోమ్యాక్స్ లాంటి సంస్థకు సహవ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన అసిన్ కెరీర్లో ఉన్న కొన్ని హిట్లలో ఒకటి హౌస్ ఫుల్ 2. కామెడీ ప్రధానంగా ఉండే ఈ సినిమాలో అసిన్ మంచి పాత్రే పోషించింది. రీసెంట్ గా పెళ్లైపోవడంతో ఆమె హౌస్ ఫుల్ 3 లో నటించలేకపోయింది. ఆమె స్థానంలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చి చేరింది. అయితే ఆమె ఈ సినిమా టీం ను మిస్సవకుండా, థర్డ్ పార్ట్ టీం అంతా ఆమె ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముక్, హీరోయిన్స్ కలిసి ఢిల్లీ ఉన్న అసిన్ ఇంట్లో పార్టీ చేసుకున్నారు. హౌస్ ఫుల్ 3 టీం అంతా, కొత్తగా పెళ్లైన హౌస్ ఫుల్ 2 నటి అసిన్ దంపతులను ఢిల్లీలో కలిశామని ట్వీట్ చేశాడు అక్షయ్. అర్ధరాత్రి సర్ప్రైజ్ ఇచ్చినా, అందరికీ విందు ఏర్పాటు చేసినందుకు అసిన్ కు ధ్యాంక్స్ చెప్పాడు. జూన్ 3 న రిలీజవుతున్న హౌస్ ఫుల్ 3, హౌస్ ఫుల్ సీరీస్ లో మూడవది కావడం విశేషం.