ఇద్దరూ కలిస్తే పండగేగా!
on Aug 20, 2017
ప్రస్తుతం నాని రోజులు నడుస్తున్నాయ్. తను పట్టిందల్లా బంగారం అవుతోంది. వరుసగా ఏడు హిట్లు అంటే సాధారణమైన విషయమా? ఇప్పుడున్న ఏ హీరోకీ లేని రికార్డ్ ఇది. సిక్సర్ పూర్తి చేసి... ‘నిన్ను కోరి’ హిట్ తో డబుల్ సిక్సర్ కి శ్రీకారం చుట్టాడు నాని. డిసెంబర్ 21న నాని ‘ఎంసీఏ’ సినిమా రాబోతోంది. ఇది కూడా డెఫెనెట్ హిట్ అని ఘంటాపథంగా చెబుతున్నారు నాని ఫ్యాన్స్. పైగా ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు. కథ ఎంపికలో ఆయన నిజంగా రాజే. అందుకే.. వరుస విజయాలు ఖాతాలో వేసుకోగలుగుతున్నాడు.
ఇక ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ... ‘సాయి పల్లవి’. ప్రస్తుతం కుర్రాళ్లు సాయి పల్లవి జపంలో మునిగి తేలుతున్నారు. ‘ఫిదా’తో ఈ అమ్మడు చేసిన మేజిక్కు అలాంటి మరి. ఇంతటి క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు.
వేణు శ్రీరామ్ గత చిత్రాల గురించి పట్టించుకోకుండా... నాని, దిల్ రాజు ఈ చిత్రానికి అవకాశం ఇచ్చారంటే.. కచ్చితంగా ఇది మంచి కథ అయ్యుంటుందని ఫిలింనగర్ టాక్. నాని... ఎనర్జీకి మారుపేరు. సాయి పల్లవి నిజంగా హైపర్ యాక్టివ్. వీరిద్దరూ ఒకేసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే... ఇక చెప్పేదేముంది! తెరంతా పండగ వాతావరణమే. మరి ఈ పండగను చూడాలంటే... డిసెంబర్ 21 ఆగాల్సిందే. వెయిట్ అండ్ సీ.
Also Read