స్టార్ హీరోలను వాడేస్తున్న నాని!
on Jul 1, 2016
నాని స్పీడ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. మొన్నామధ్య వరుస పరాజయాలతో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ.. వెంటనే తేరుకొని "ఎవడే సుబ్రమణ్యం" నుంచి మళ్ళీ విజయాల బాట పట్టాడు. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న "జెంటిల్ మెన్" సినిమా మనోడికి మరింత ఊపునిచ్చింది. ఆ ఉత్సాహంతోనే విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఫుల్ జోష్ తో నటించేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. ఇకపోతే.. విరించివర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి నాగార్జున సూపర్ హిట్ సినిమా "మజ్ను" టైటిల్ ను ఫిక్స్ చేసుకొన్న నాని.. అదే తరహాలో "సినిమా చూపిస్తా మావ" ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి "ఇడియట్" సినిమాలోని రవితేజ ఫేమస్ డైలాగ్ అయిన "నేను లోకల్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ఈ విధంగా నాగార్జున, రవితేజలను వాడేస్తూ తన కెరీర్ ను సూపర్ ఫాస్ట్ గా సెటిల్ చేసుకొంటున్నాడు నాని! నాని మునుపటి చిత్రం "కృష్ణగాడి వీరప్రేమ గాధ"లోనూ బాలకృష్ణ వీరాభిమానిగా కనిపించి.. నందమూరి అభిమానుల ఆదరణను నాని చూరగొన్న విషయం తెలిసిందే!