మెగా ఫ్యాన్స్ vs బాలకృష్ణ ఫ్యాన్స్!
on Dec 10, 2018
#comedianbalakrishnagaru #comedianbalayya... సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ ట్విట్టర్లో ఈ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ టాపిక్! బాలకృష్ణ పెద్ద కమెడియన్ అని మెగా బ్రదర్ నాగబాబు సెటైర్స్ వేయడంతో మెగా అభిమానులు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా విజృంభించారు. గతంలో బాలకృష్ణ మాట్లాడిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేశారు. మెగా అభిమానులు బాలకృష్ణపై ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి నాగబాబు వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులు ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగబాబును సూసైడ్ స్టార్‌గా పేర్కొంటూ పలు ట్వీట్స్ చేశారు. సూసైడ్స్టార్నాగబాబు అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది కూడా! దీనికి బదులుగా మెగాభిమానులు రంగంలోకి దిగారు. తాము ఏమీ తక్కువ తినలేదన్నట్టు ట్విట్టర్లో తమ యుద్ధం ప్రారంభించారు.
‘మెంటల్స్టార్బాలకృష్ణ’, ‘తారాచౌదరిహౌస్కీప్బాలయ్య’, ‘ఎవడ్రాబాలకృష్ణ’, ‘దున్నపోతుబాలకృష్ణ’, ‘హూఈజ్మెంటల్బాలకృష్ణ’, ‘బాలయ్యఎవడు’, ‘గలీజ్స్టార్బాలయ్య’, ‘వల్గర్స్టార్బాలకృష్ణ’, ‘స్లాపింగ్స్టార్బాలకృష్ణ’... ఒకటి, రెండు కాదు, బాలకృష్ణ పేరుకు ముందు తమకు నచ్చిన ట్యాగ్ తగిలించి ట్వీట్లు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ‘హే బుల్ బుల్’ అంటూ బాలకృష్ణ చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేశారు. అదే విధంగా గతంలో వేదికలపై బాలకృష్ణ తడబడుతూ మాట్లాడిన ప్రసంగాలను, అభిమానులపై చేయి చేసుకున్న వీడియోలను మరోసారి తెరపైకి తెచ్చారు.
బాలకృష్ణ అభిమానులు ‘కమెడియన్నాగబాబు’ ‘లేకిస్టార్చింపు’, ‘కాజల్డ్రైవర్పావల’ అంటూ ట్విట్టర్లో హల్చల్ చేశారు. ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయి మాటల యుద్ధం చేశారు. ప్రత్యర్థి వర్గంపై నోరు పారేసుకున్నారు. ఇరు వర్గాల అభిమానులు గొడవ పడుతుంటే... కొంతమంది నాగబాబు కుమార్తె నిహారిక, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కలిసి దిగిన ఫొటోలను బయటకు తీశారు. అభిమానులు గొడవ పడుతుంటే, వాళ్ల పిల్లలు కలిసి తిరుగుతున్నారని... చివరకు, అభిమానులు వెర్రి వెధవలు అవుతారని... ఈ మాటల యుద్ధం ఆపాలని హితవు పలికారు.