English | Telugu

నేను పొడుగోళ్లలో పొట్టోడ్ని...!

on Jan 23, 2018

స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు...  దర్శకులు కొన్ని విషయాలను మాత్రం తూచ తప్పక పాటిస్తారు. ఏ పాత్రా... హీరో పాత్రను డామినేట్ చేయకుండా చూసుకోవడం అందులో ఒకటి. చివరకు హైట్ విషయంలో  కూడా రాజీ పడరు.

తమల్ని డామనేట్ చేసే పాత్రలున్నా... సీన్స్ ఉన్నా.. కనీసం తమకంటే ఎదుటివాడు హైట్ గా కనిపిస్తున్నా కూడా... హీరోలు కూడా క్షమించరు. ఇమిడియట్ గా పాత్రధారులు మారిపోతుంటారు.

అయితే... బాలకృష్ణ వీరందరిలో విభిన్నం. విలన్ పాత్రలే కాదు... కథనాయికలు తనకంటే హైట్ ఉన్నా..ఆయన పెద్దగా పట్టించుకోరు. అందుకు ఉదాహరణే ఆయన గత చిత్రాలు. బాలయ్యతో హిట్ పేయిర్ అనిపించుకున్న సిమ్రన్.. ఆయనకంటే హైట్. వీళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. ‘నరసింహనాయుడు’ విలన్ ముఖేష్ రుషి... బాలయ్య కంటే చాలా హైట్. కానీ.. ఆయన చాలా సినిమాల్లో బాలయ్యతో కలిసి పనిచేశాడు.

బాలయ్య రీసెంట్ హిట్...‘జై సింహా’లో కూడా ఓ హీరోయిన్ గా నటించిన నటాషా జోషి.. బాలయ్య కంటే హైట్. విలన్ గా చేసిన కాలకేయ ప్రభాకర్ అయితే.. బాలయ్య కంటే చాలా హైట్. అయినా సరే... వారిద్దరినీ హీరోయిన్ గా, విలన్ గా తీసుకున్నారు.
దీని గురించి ఇటీవల ‘జై సింహ’ విజయోత్సవ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ... ‘నేను పొట్టోడ్నని... నా సినిమాల్లో పొడుగోళ్లు చేయకూడదంటే ఎలా? అది కళామతల్లికి ద్రోహం చేసినట్లే.. అవకాశం కోసం వచ్చే వారిని అలా హైట్ ఉన్నాడని అన్యాయం చేయకూడదు. ‘నరసింహనాయుడు’  టైమ్ లో కూడా ఇలాగే జరిగింది.

విలన్లలో ఓ విలన్ గా చేయడానికి ఓ నటుడు ఆడిషన్ కి వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నాడనీ... నేను పొట్టోడ్ని కాబట్టి.. నా పక్కన అతను పొడుగ్గా కనపడతాడు కాబట్టి... అతడ్ని పంపించేశారట. ఈ విషయం నాకు తెలిసి.. అతడ్ని మళ్లీ పిలిపించి వేషం ఇచ్చా. ఇందులో కూడా నటాషా నాకంటే హైట్. ప్రభాకర్ నా కంటే హైట్. నా ఫ్రెండ్స్ గా నటించిన శివాజీరాజా గ్రూప్ అంతా కూడా నా కంటే పొడుగు వాళ్లే. నేను పొడుగోళ్లలో పొట్టోడ్ని. పొట్టోళ్లలో పొడుగోడ్ని’ అని చెప్పి... వేదికపై అందర్నీ నవ్వించారు బాలయ్య.

స్వీయ లోపంబెరుగుట గొప్ప విద్య అన్నారు. ఈ విషయంలో బాలయ్యను నిజంగా మెచ్చుకోవాల్సిందే. తనపై తానే సెటైర్ వేసుకోవడం...తన లోపాన్ని తానే ఎత్తి చూపడం.. బాలయ్య గొప్పతనాన్ని చెప్పకనే చెబుతుంది. ఏమంటారు ప్రెండ్స్.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here