English | Telugu

సెట్స్ మీద మ‌హేశ్ స్ట‌న్నింగ్ ఫొటో.. షేర్ చేసిన న‌మ్ర‌త‌

on Oct 30, 2020

 

అక్టోబ‌ర్ 30న సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న భ‌ర్త సెట్స్ మీదున్న ఓ అంద‌మైన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అది ఒక యాడ్ ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించింది. తెర‌వెనుక ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో ఆ పిక్చ‌ర్ తెలియ‌జేస్తోంది. ఆ ఫొటోలో మ‌హేశ్ సెట్స్ మీదున్న లైట్లు, ఫిల్ట‌ర్లు వంక ఆస‌క్తిగా చూస్తున్నాడు. డార్క్ ఎల్లో ష‌ర్ట్, గ్రే చార్‌కోల్ క‌ల‌ర్ ప్యాంట్స్ ధ‌రించి ఎప్ప‌టిలా డాప‌ర్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఆ స్ట‌న్నింగ్ ఫొటోతో పాటు, "లైట్స్‌!! కెమెరా!! యాక్ష‌న్‌!! 3 words that make magic for most of us !! #lifeonset #behindthescenes." అని క్యాప్ష‌న్ పెట్టారు న‌మ్ర‌త‌. ఆ ఫొటో ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మొద‌లుపెట్టిన కొద్దిసేప‌టికే మ‌హేశ్ అక్క‌య్య మంజుల "ఆబ్స‌ల్యూట్‌లీ" అంటూ ఓ అంద‌మైన కాంప్లిమెంట్‌ను కామెంట్ సెక్ష‌న్‌లో పెట్టారు.

ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా భ‌ర్త మ‌హేశ్ సెట్స్ మీదున్న ఫొటోల‌ను షేర్ చేస్తూ వ‌స్తున్నారు న‌మ్ర‌త‌. రెండు రోజుల క్రిత‌మే ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మ‌హేశ్ షూటింగ్‌కు రెడీ అవుతున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. అందులో మ‌హేశ్ చైర్‌లో కూర్చొని ఉండ‌గా, ఆయ‌న ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మ్యాన్ ప‌ట్టాభి మేక‌ప్ చేస్తున్నాడు. అది ఫ్లిప్‌కార్ట్ యాడ్ షూట్‌కు సంబంధించింది. ఆ ఫొటోలో పెట్టుడు మీసంతో, తెల్ల‌చొక్కా, తెల్ల లుంగీతో క‌నిపిస్తున్నాడు మ‌హేశ్‌. "Add-ons (in this case a moustache!!) never looked more real! Shooting with one is not necessarily comfortable or fun!! But who doesn't love challenges when there are experts by your side #Pattabhi #DOPBose @sallu.al." అంటూ ఆ ఫొటోకు క్యాప్ష‌న్ పెట్టారు న‌మ్ర‌త‌.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.