నమిత పెళ్లి గురించే కానీ.. దీనిని పట్టించుకోరా..?
on Nov 24, 2017
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బొద్దుగుమ్మ నమిత వివాహం వీరేంద్ర చౌదరితో ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సరే ఈ సంగతి పక్కనబెడితే అసలు నమితకు వీరేంద్రతో పరిచయం ఎలా కలిగింది.. ప్రేమ ఎప్పుడు మొదలైంది అని ఆరా తీస్తే.. నమితకు తన బెస్ట్ ఫ్రెండ్ శశిథర్ బాబు ద్వారా వీర్ గత ఏడాది పరిచయం అయ్యాడట..
ఆ తర్వాత "మియా" చిత్రంలో వీర్‌తో కలిసి నటించింది. ఇద్దరి అభిప్రాయాలు దగ్గరగా ఉండటంతో త్వరగానే మంచి స్నేహితులయ్యారు.. అయితే ఈ స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.. సెప్టెంబర్ 6, 2017న ప్రత్యేకంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి అక్కడే తన మనసులోని మాటను నమితకు చెప్పాడు వీర్. లక్ష్యాలు ఒకటే కావడం, ఆధ్యాత్మిక భావనలు ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావడంతో నమిత నో చెప్పలేకపోయింది. మూడు నెలల పాటు ఒకరినొకరు అర్థం చేసకున్న ఈ జంట తమ ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి పెద్దల అంగీకారంతో ఒక్కటైంది.