నాగశౌర్య ఫస్ట్ ఫిల్మ్ 'క్రికెట్ గాళ్స్ అండ్ బీర్' అనే విషయం మీకు తెలుసా?
on Dec 3, 2020
'ఊహలు గుసగుసలాడే' (2014) సినిమాతో పరిచయం అయ్యానని చెబుతుంటాడు కానీ, దానికి మూడేళ్లకు ముందే 'క్రికెట్ గాళ్స్ అండ్ బీర్' (2011) అనే సినిమాతో పరిచయమయ్యాడు. ఉమేశ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ ముగ్గురు అన్నదమ్ముల కథ. ఆ ముగ్గురు అన్నదమ్ములుగా ఆదర్శ్ బాలకృష్ణ, నాగశౌర్య, సూర్యతేజ నటించారు. నాగశౌర్య పాత్ర పేరు విక్రమ్. బీర్ బాటిల్ చూస్తే చాలా మనవాడు మిగతావన్నీ మర్చిపోతాడు. అంత పిచ్చి అన్నమాట.
ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ప్రేక్షకులు ఆ పేరుతో ఓ సినిమా వచ్చిందనే విషయమూ మర్చిపోయారు. అందుకే నాగశౌర్య ఆ సినిమా విషయాన్ని అసలు ప్రస్తావించడు. కానీ నిజం నిజం కాకుండా పోదు కదా! ఆ సినిమాతో ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో నిరాశలో మునిగిపోయాడు శౌర్య. మూడేళ్ల తర్వాత దాదాపు ఒకేసారి 'ఊహలు గుసగుసలాడే', 'చందమామ కథలు' సినిమాల్లో అవకాశాలు సంపాదించాడు. ఆ రెండు సినిమాలూ ప్రేక్షకుల దృష్టిలో పడటంతో శౌర్యకు అవకాశాలు లభిస్తూ వచ్చాయి. ప్రస్తుతం 'లక్ష్య' అనే సినిమాలో ఆర్చర్‌గా నటిస్తున్నాడు.
Also Read