నాగ చైతన్య , సమంత జీవితాల్లో మధురమైన రోజు
on Mar 17, 2018
పెళ్ళికి ముందు కొన్ని సినిమాల్లో కలిసి పని చేసిన నాగ చైతన్య, సమంత మొదటిసారి పెళ్లి తర్వాత ఒక సినిమా కోసం జత కట్టనున్నారు. నిన్ను కోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం కోసం రొమాన్స్ కి రెడీ అవుతున్నారు కొత్త జంట. ఈ రోజు సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో పాల్గొనేందుకు ఇద్దరు ఒకే కార్ లో వెళ్లారు. 'ఈరోజు ఖచ్చితంగా కొత్త రోజు. సమంతతో కలిసి వర్క్ చేయడానికి వెళ్తున్నాను’ అన్నారు నాగ చైతన్య. త్వరలో మొదలవనున్న సినిమాలో నాగ చైతన్య మరియు సమంత సరికొత్త రోల్స్ లో కనువిందు చేయనున్నారని సమాచారం. మొదటి సినిమా నిన్ను కోరి తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న శివ, నాగ చైతన్య, సమంత లని దృష్టిలో ఉంచుకొని ఒక మంచి లవ్ స్టోరీ రెడీ చేశారట. కథ నచ్చడంతో వెంటనే ఒకే చేసిన ఈ కొత్త జంట, స్క్రిప్ట్ పనుల్లో కూడా పాల్గొనేందుకు ఒప్పుకున్నారట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ త్వరలో కంప్లీట్ చేసి సినిమాని సెట్స్ లోకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సో, ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ గా ఉన్న చైతన్య, సామ్ కి ఈ సినిమా ద్వారా కలిసి పని చేసే అవకాశం వచ్చింది.