English | Telugu

హిందీ 'జెర్సీ'కి హీరోయిన్ దొరికింది

on Nov 19, 2019

 

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకొని, విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. నాని కేరెక్టర్‌ను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఇటీవలే 'అర్జున్‌రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'గా నటించి, సూపర్ హిట్ కొట్టిన షాహిద్, వెంటనే మరో తెలుగు రీమేక్‌కు సంతకం చెయ్యడం గమనార్హం. ఈ మూవీలో నాయికగా మృణాల్ ఠాకుర్ ఎంపికైంది. 'సూపర్ 30', 'బాట్లా హౌస్' సినిమాలతో తన నటనతో అలరించిన మృణాల్‌కు ఇది భిన్న కేరెక్టర్.

షాహిద్‌తో కలిసి నటిస్తుండటంపై మాట్లాడుతూ "షాహిద్ జోడీగా 'జెర్సీ'లో నటించనుండటం నన్ను ఉద్వేగానికి గురి చేస్తోంది. ఒరిజినల్ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషనల్ జర్నీకి పడిపోయాను" అని చెప్పింది మృణాల్. సినిమాలో ఆమెది చాలా కీలక పాత్ర. 36 ఏళ్ల వయసులో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఒక క్రికెటర్ జీవితంలోని హృదయాన్ని మెలిపెట్టే దశను చూపించే ఆ కథలో, ఆ క్రికెటర్‌కూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్యకూ మధ్య నెలకొన్న ఘర్షణ కీలక పాత్ర పోషిస్తుంది. అంతకుముందు, తన ఇన్‌స్టాగ్రాం పేజీలో జెర్సీలోని తన లుక్‌ను వెల్లడి చేశాడు షాహిద్. చేతిలో క్రికెట్ బ్యాట్‌తో, వైట్ జెర్సీలో కనిపిస్తున్న అతను "జెర్సీ ప్రిపరేషన్స్ బిగిన్స్' అంటూ పోస్ట్ చేశాడు.


Cinema Galleries



Latest News


Video-Gossips